మనోజ్, విష్ణు.! ఎందుకు కొట్టుకున్నారంటే.!

మంచు మనోజ్ చిన్నోడు.. మంచు మనోజ్ పెద్దోడు.! పెద్దోడు, చిన్నోడ్ని ఎందుకు కొట్టాడు.? అసలు కొట్టాడా.? లేదా.? మధ్యలో సారధి ఎవరు.? ఈ గొడవ అంతటికీ కారణమేంటి.? కొన్నాళ్ళ క్రితమే మంచు మనోజ్ పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళిలోనూ విష్ణు ముబావంగానే వున్నాడు. పెళ్ళి జరిగింది కూడా మంచు లక్ష్మి ఇంట్లో. మోహన్‌బాబుకి ఆ పెళ్ళి ఇస్టం లేదనే ఊహాగానాలు వినిపించాయి కూడా.

ఎక్కడో విషయం తేడా కొడుతోంది. కొన్నాళ్ళుగా మంచు కుటుంబంలో విభేదాలున్నాయి. కుటుంబం అన్నాక అభిప్రాయ బేధాలు మామూలే. మంచు మనోజ్ పెళ్ళితో ఆ అభిప్రాయ బేధాలు సమసిపోతాయనుకుంటే, గొడవలు పెరిగాయ్.

కొట్లాట వరకూ వెళ్ళింది. ఎంత పెద్ద కొట్లాట జరిగి వుండకపోతే, ‘ఇలా దాడులు చేస్తారు.. బంధువుల మీదా.. మా మీదా..’ అంటూ మనోజ్ ఓ వీడియో విడుదల చేశాడు. ‘మీ మీదా.. మా బంధువుల మీదా..’ అంటే, దానర్థమేంటి.? మనోజ్ పెళ్ళిని విష్ణు అంగీకరించలేదా.? మోహన్‌బాబుకి ఈ వయసులో ఈ కొడుకుల కొట్లాట జీర్ణించుకోవడం కష్టమే.