మెగాస్టార్ చిరంజీవి అంటేనే కమర్షియల్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్. ప్రేక్షకులు కూడా అతనిని కమర్షియల్ హీరోగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అందించే కథలలోనే చూడటానికి ఇష్టపడతారు. సీరియస్ రోల్స్ లో చిరంజీవి కనిపించిన అంతగా యాక్సప్ట్ చేయలేరు. ఈ విషయం సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్, ఆచార్య సినిమాలతో రుజువైపోయింది.
దీంతో వాల్తేర్ వీరయ్య సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఈ మూవీ తెరకెక్కింది. ఇక ఈ సినిమాతో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా కమర్షియల్ ఎంటర్టైనర్ గానే తెరకెక్కుతోంది.
ఇదిలా ఉంటే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో ఏదో కొత్త కథలు, థ్రిల్లర్స్ వైపు పోకుండా పక్కా కమర్షియల్ కథలనే ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం యంగ్ జెనరేషన్ లో వివేక్ ఆత్రేయ, తరుణ్ భాస్కర్, హను రాఘవపూడి, గౌతమ్ తిన్ననూరి, ప్రశాంత్ వర్మ, వేణు ఉడుగుల లాంటి దర్శకులు కథలతో సత్తా చాటుతున్నారు. అయితే కమర్షియల్ టచ్ ఉన్న దర్శకులకె మెగాస్టార్ మొగ్గు చూపిస్తున్నారు.
యువ దర్శకులతోనే సినిమాలు చేయడానికి రెడీ అవుతున్న కచ్చితంగా కమర్షియల్ మాస్ టచ్ కథలతో సినిమాలు చేయగలవారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా నెక్స్ట్ మూవీని కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అతనికి జోడీగా శ్రీలీల నటిస్తోంది. ప్రసన్నకుమార్ బెజవాడ ఈ మూవీకి కథ అందిస్తున్నాడు.
దీని తర్వాత బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథతో మూవీ చేయబోతున్నాడంట. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం కూడా ఈ ఏడాదిలోనే స్టార్ట్ కానుంది. మొత్తానికి కమర్షియల్ కథలకి మెగాస్టార్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అతని మూవీ సెలక్షన్ చూస్తూ ఉంటే తెలుస్తోంది.