లవ్ గాసిప్స్ పై పూజా హెగ్డే ఏమందంటే?

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇటు తెలుగుతో పాటు అటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరో వైపు హిందీలో సల్మాన్ ఖాన్ కి జోడీగా కిసికా జాన్ కిసికి భాయ్ అనే మూవీలో నటించింది.

ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్స్ విక్టరీ వెంకటేష్ తో పాటు జగపతి బాబు కూడా నటిస్తున్నారు. జగపతి బాబు మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు. సల్మాన్ ఖాన్ సొంతం ప్రొడక్షన్ లోనే ఈ సినిమా తెరకెక్కింది. ఇక తమిళ్ హిట్ మూవీకి రీమేక్ గా ఇది తెరకెక్కింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంటోంది.

సల్మాన్ ఖాన్ తో ఏ హీరోయిన్ మూవీ చేసిన వారితో డేటింగ్ లో ఉంటాడనే ప్రచారం బాలీవుడ్ లో నిత్యం వినిపిస్తూ ఉంటుంది. గతంలో ఐశ్వర్య రాయ్ తో మొదలు పెడితే శ్రీలంక బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ వరకు అందరూ కూడా సల్మాన్ ఖాన్ తో సినిమాలు చేసిన తర్వాత అతనితో డేటింగ్ లో ఉన్నారు అంటూ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.

ఇప్పుడు పూజా హెగ్డే మీద కూడా అలంటి ప్రచారమే వస్తోంది. పూజా సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేస్తోంది అయితే ఈ రూమర్స్ పై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి తాను సింగిల్ గా ఉన్నానని, ఎవరితో డేట్ చేసేంత టైమ్ లేదని పేర్కొంది. తన ఫోకస్ అంతా కూడా సినిమాల మీద మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చింది.

రీసెంట్ గా మంగళూరులో పూజా హెగ్డే సోదరుడు పెళ్లి వేడుక జరిగింది. దీనికి సల్మాన్ ఖాన్ హాజరు కావడంతోనే ఈ రూమర్స్ ప్రచారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే డేటింగ్ లో టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ ప్రచారానికి ఆమె ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టింది.