మణిరత్నం దర్శకత్వంలో కోలీవుడ్ మల్టీ స్టారర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ పార్ట్ 1 ఇప్పటికే రిలీజ్ అయ్యింది. ఒక్క తమిళనాడులో తప్ప మిగిలిన అన్ని భాషలలో మొదటి భాగం డిజాస్టర్ అయ్యింది. ప్రేక్షకులకి ఏ మాత్రం కనెక్ట్ కాలేదు.
అయితే మణిరత్నం లాంటి దర్శకుడి నుంచి వచ్చిన మూవీ కావడంతో కొంత వరకు ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. దీంతో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూడు వందల కోట్ల పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ లో భాగమైన పార్ట్ 2 ఏప్రిల్ 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. మొదటి భాగం కంటే మరింత పెర్ఫెక్ట్ గా పొన్నియన్ సెల్వన్ 2 మణిరత్నం డిజైన్ చేశారు.
అసలు కథ అంతా రెండో భాగంలోనే ఉండనుంది. అయితే మొదటి సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడం వలన ఇతర భాషలలో పార్ట్ 2కి పెద్దగా మార్కెట్ జరగలేదు. అలాగే అంచనాలు కూడా ఏమంతగా లేవు. ఒక్క కోలీవుడ్ లో మాత్రమే మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తెలుగులో అయితే సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ అయిన బజ్ అయితే క్రియేట్ చేయలేకపోయింది.
ఈ నేపధ్యంలో పొన్నియన్ సెల్వన్ 2 ఏ మేరకు కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ప్రశ్నగా ఉంది. కనీసం మొదటి సినిమా సాధించిన కలెక్షన్స్ అయిన అందుకుంటుందా అనేది కూడా డౌట్ గానే ఉంది. అయితే మణిరత్నం మాత్రం చాలా నమ్మకంగా ఈ పొన్నియన్ సెల్వన్ 2ని రిలీజ్ చేస్తున్నారు. కచ్చితంగా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతోంది అని ఆశిస్తున్నారు.
పార్ట్ 2లో భారీ యాక్షన్స్ సీక్వెన్స్, అంతకు మించి ఇంటరెస్టింగ్ డ్రామా, రాజ్యం కోసం జరిగే కుట్రలు, ఎత్తులు పై ఎత్తులతో కథ కూడా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతోంది అని అంచనా వేస్తున్నారు. మొదటి భాగం కంటే మరింత బెటర్ గా ప్రేక్షాక్ధారణ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.