మహేష్ బాబు పరిస్థితి ఏంటి ఇలా అయింది.. కుటుంబ సభ్యుల విషయంలో వరుస షాకులు?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటారు.తనకు సినిమా షూటింగుల సమయంలో ఏ మాత్రం విరామం దొరికిన వెంటనే తన ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్తూ ఎంతో ఎంజాయ్ చేసే మహేష్ బాబుకు ఈమధ్య కాస్త బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పాలి. కుటుంబ సభ్యుల విషయంలో ఈయనకు వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.

గత కొన్ని నెలల క్రితం తనకు ఎంతో ఇష్టమైన తనని ప్రాణంగా ప్రేమించే తన అన్నయ్య రమేష్ బాబు మరణించడంతో మహేష్ బాబుకు గట్టి షాక్ తగిలింది.అయితే అదే సమయంలో మహేష్ బాబు కోవిడ్ బారిన పడటంతో తన అన్నయ్య చివరి చూపులకి కూడా నోచుకోలేకపోయారు. ఇలా ఈ బాధ నుంచి బయటపడేలోపే తన తల్లి ఇందిరా దేవి మరణించారు. తల్లి మరణంతో మహేష్ బాబు ఎంతగానో కృంగిపోయారు. తన అన్నయ్య రమేష్ బాబు మరణించడంతో ఇక కొడుకుగా తన తల్లికి చేయాల్సిన కార్యక్రమాలన్నింటిని పూర్తి చేశారు.

ఇక తన తల్లి మరణం మర్చిపోకముందే తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తీవ్రమైన గుండెపోటుతో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది 24 గంటలు గడిస్తే తప్ప ఆయన ఆరోగ్యం గురించి ఏ విషయం చెప్పలేమంటూ కాంటినెంటల్ వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన మహేష్ బాబు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఇలా వరుసగా కుటుంబంలో విషాదాలు చోటు చేసుకుంటూ మహేష్ బాబును ఒక్కరి బిక్కిరి చేస్తున్నాయి. కృష్ణ ఆరోగ్య పరిస్థితి తెలిసినటువంటి అభిమానులు తాను త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు.