రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’పై నెటిజన్లు ఏమంటున్నారంటే…?

మాస్‌ మహారాజా రవితేజ నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకత్వం వహించారు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. నూపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు.

‘వాల్తేరు వీరయ్య’, ‘‘ధమాకా’ చిత్రాలు మినహాయిస్తే మిగిలిన చిత్రాలు అంతంత మాత్రంగానే ఆడాయి. కానీ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ విడుదల మొదలు ట్రైలర్‌ వరకూ సినిమాకు హైప్‌ తీసుకొచ్చాయి. దీనికి తోడు పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయడంతో నార్త్‌లో కూడా ప్రచారం బాగా చేశారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

మరి ఈ చిత్రం ఎలా ఉందో.. సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం…
సినిమా ఫస్టాఫ్‌ అయ్యేసరికి స్పందన బాగానే ఉంది. ట్విట్టర్‌ వేదికగా నెటిజన్లు పాజిటవ్‌గానే మాట్లాడుకుంటున్నారు. డార్క్‌ క్యారెక్టర్‌లో రవితేజ యాక్షన్‌ అద్భుతంగా ఉందని, ఆ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్‌ యాప్‌ అని రాసుకొస్తున్నారు.

అలాగే యాక్షన సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయని చెబుతున్నారు. టైన్‌ సీక్వెన్స్‌ ఆసక్తికరంగా ఉందని ట్వీట్స్‌ చేస్తున్నారు. మరో నెటిజన్ అయితే అంతా బాగానే ఉంది కానీ.. రన్‌ టైమ్‌ ఇబ్బందికరంగా మారిందని పోస్ట్‌ చేశారు. లవ్‌ట్రాక్‌ అంతగా వర్కవుట్‌ కాకపోవడం సినిమాకు మైనస్‌ అని, ఓ మోస్తరు సినిమా సోసోగా సాగిందని ఓ నెటిజన పేర్కొన్నారు.

ఈ మధ్యకాలంలో రవితేజ్‌ బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఇదేనని చెబుతున్నారు. జీవీ ప్రకాష్‌ మ్యూజిక్‌ ఫర్వాలేదనిపించింది. కొత్తగా ఏమీ చేయలేదని అభిప్రాయపడుతున్నారు. కొందరు నెటిజన్లు యావరేజ్‌ టాక్‌ అని అంటుంటే.. మరికొందరు 3.25 రేటింగ్‌ ఇచ్చి సూపర్‌ హిట్‌ .. బొమ్మ దద్దరిల్లింది అని హల్‌చల్‌ చేస్తున్నారు.