సమంత ని అలా చూపించాలంటే దమ్ముండాలి…?

మజిలీ.. ఓ బేబి.. అక్కినేని సమంత నటించిన బ్లాక్ బస్టర్స్ సినిమాలు. ఆ తర్వాత హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకున్న సమంత ని జాను బాగా డిసప్పాయింట్ చేసింది. దాంతో మరోసారి నాగ చైతన్య తో కలిసి నటించేందుకు కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంట్‌టైనర్ గా రూపొందిన మజిలీ వంటి సినిమా చేసేందుకు కథలు వింటుందని సమాచారం. ఇప్పటికే పలువురు దర్శకులు సమంత, చైతన్య లకి కథలు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే సమంత, చైతూ సొంతగా నిర్మాణ సంస్థ ని ప్రారంభించాలని అనుకుంటున్నట్టు.. అందులోనే కొత్త సినిమా ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Samantha calls her hubby 'Handsome' on Instagram: Naga Chaitanya comments  “Paid partnership post” | Telugu Movie News - Times of India

కాగా ఓ బేబి తో హిట్ ఇచ్చిన నందిని రెడ్డి తో మాత్రం మరోసారి సమంత సినిమా చేయబోతుందని ఆ సినిమాలో చైతూ కనిపించబోతున్నట్టు కూడా సమాచారం. ఇక ఇప్పటికే తమిళంలో నయనతార కాబోయో భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లో నయనతార తో కలిసి సమంత నటిచబోతుందని కోలీవుడ్ మీడియా సమాచారం. అలాగే మరో తమిళ సినిమాకి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. వీటితో పాటు సమంత డెబ్యూ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 లో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తయిందని మేకర్స్ వెల్లడించారు.

The Family Man Season 2: Samantha Akkineni to make her web debut with Manoj  Bajpayee show

మొదటిసారి వెబ్ సిరీస్ చేస్తున్న సమంత ఇందులో నెగిటివ్ రోల్ లో కనిపించనుందని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తానీ ఉగ్రవాది పాత్రలో సమంత కనిపించబోతుందట. విభిన్నమైన పాత్రతో పాటు గెటప్ విషయంలో కూడా సమంత కొత్తగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే దర్శకుల గట్స్ కి మెచ్చుకోవాల్సిందే.

కాగా త్వరలో ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.. అయితే సమంత తో పాటు బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్ – ప్రియమణి – సందీప్ కిషన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.