గన్ను కావాలి….గర్ల్ ఫ్రెండ్ కావాలి విలేకరి ప్రశ్నకు నాగార్జున భారీ కౌంటర్?

నాగార్జున ప్రస్తుతం ది ఘోస్ట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నాగార్జున సోనాల్ చౌహన్ నటించినటువంటి ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో భారీ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అనంతరం చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోని మీడియా ప్రతినిధులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు చిత్ర బృందం సమాధానాలు చెబుతూ వచ్చారు. అయితే ఓ విలేకరి మాత్రం నాగార్జునను వింత ప్రశ్న అడిగారు. ఇలా విలేఖరి అడిగిన ప్రశ్నకు నాగార్జున కూడా తనదైన శైలిలో సమాధానం చెబుతూ షాక్ ఇచ్చారు. ఈ సందర్భంగా విలేకరి ప్రశ్నిస్తూ మీరు మీ సినిమాలలో ఎక్కువగా రొమాన్స్ చేయడానికి ఇష్టపడతారా లేదా గన్నులతో ఫైరింగ్ చేయడానికి ఇష్టపడతారా అంటూ వింత ప్రశ్న వేశారు.

ఈ విధంగా విలేకరి అడిగిన ప్రశ్నకు నాగర్జున సమాధానం చెబుతూ తనకు సినిమాలలో ఒకవైపు అమ్మాయిలతో రొమాన్స్ చేయడం ఇష్టం అలాగే మరోవైపు గన్నులతో ఫైరింగ్ చేయడం కూడా ఇష్టమే అంటూ సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఫన్నీ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం నాగార్జున చెప్పిన ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే అక్టోబర్ 5వ తేదీ తన సినిమా రాబోతుందని ఈ సినిమాని తప్పకుండా ప్రతి ఒక్కరు చూసి సినిమాని ఆదరించాలని ఈ సందర్భంగా నాగార్జున అభిమానులను కోరారు.