అఫీషియల్ గా వారి హిస్టరీలోనే “వాల్తేరు వీరయ్య” బిగ్గెస్ట్ ప్రాఫిట్.!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా భారీ అంచనాలు నడుమ వచ్చిన సంక్రాంతి మాసివ్ చిత్రాల్లో భారీ అంచనాలు నడుమ వచ్చిన చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. మరి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం తన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లతో రికార్డు సెట్ చేయగా నిన్ననే అత్యంత ఘనంగా చిత్ర యూనిట్ సినిమా సక్సెస్ పార్టీ చేసుకున్నారు.

అయితే ఈ వేడుకల్లోనే సినిమా ఎంత పెద్ద హిట్ అనేది స్వయంగా నిర్మాతలే అనౌన్స్ చేయడం చర్చగా మారింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించగా వారిలో ఒక నిర్మాత అయితే తమ బ్యానర్ లో వాల్తేరు వీరయ్య ఎలాంటి వండర్స్ చేసిందో చెప్పారు.

తాను సినిమా రిలీజ్ అయ్యిన రోజు నుంచి అంచనాగా ఓ నెంబర్ అనుకుంటే దానికి 25 శాతం ఎక్కువ వసూలు చేసేది అని సినిమా బిజినెస్ కి బ్రేకీవెన్ అయితే దాన్ని డిస్ట్రిబ్యూటర్స్ హిట్ అంటారు అదే దానికన్నా ఓ ఇరవై పర్సెంట్ వసూలు అయితే బ్లాక్ బస్టర్ అంటారు కానీ అంతకు మించి ఓవర్ ఫ్లో లాభాలు ఈ చిత్రానికి వస్తున్నాయని అంటున్నారు దీన్నేం అనాలి అని చెప్పారు.

అలాగే తాము ఇప్పటివరకు తమ బ్యానర్స్ లో ఎన్నో సినిమాలు చేసాం కానీ వాటి అన్నిటికన్నా వాల్తేరు వీరయ్య రెక్కువ రెవెన్యూ ఇచ్చింది అని పెద్ద అనౌన్స్ మెంట్ నే చేయడం గమనార్హం. దీనితో వాల్తేరు వీరయ్య చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి లాభాలు అందిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా వాల్తేరు వీరయ్య తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే రాబడుతుంది అని ట్రేడ్ సర్కిల్స్ వారు అంటున్నారు.