“వీరసింహారెడ్డి” కి భారీ మార్జిన్ తో “వాల్తేరు వీరయ్య” వసూళ్లు.!

ఈ ఏడు సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చి భారీ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో తమ అభిమాన హీరోలని డైరెక్ట్ చేస్తూ వచ్చిన రెండు సినిమాలు అయితే ఉన్నాయి. మరి ఈ సినిమాలే బాలయ్యతో దర్శకుడు గోపీచంద్ మలినేని చేసిన వీరసింహా రెడ్డి ఒకటి కాగా మరొకటి కొల్లి బాబీ తెరకెక్కిచిన చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి.

మరి ఈ రెండు సినిమాలు కూడా భారీ వసూళ్లు ఓపెనింగ్ డే అందుకున్నాయి. కానీ నెక్స్ట్ మాత్రం వాల్తేరు వీరయ్య పూర్తి డామినేషన్ తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్ లో అందుకోవడం విశేషంగా మారింది. ఇక ఏపీ తెలంగాణాలో అయితే వాల్తేరు వీరయ్య చిత్రం ఇప్పుడు ఏకంగా 100 కోట్ల షేర్ మార్క్ దిశగా దూసుకెళ్తుంది.

ఇది 100 కోట్ల గ్రాస్ కాదు 100 కోట్ల షేర్ మార్క్. ఆల్రెడీ మేకర్స్ ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే వీరసింహా రెడ్డి సినిమా చిరు సినిమా కన్నా ఒక రోజు ముందే రిలీజ్ చేసినా వీరయ్య సినిమా కన్నా వెనకబడి ఉంది.

ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ చిత్రం వాల్తేరు వీరయ్య కన్నా 50 నుంచి 60 కోట్ల తేడా వెనక్కి ఉందట. దీనిబట్టి వాల్తేరు వీరయ్య సినిమా మార్జిన్ ఏ లెవెల్లో ఉందో మనం అర్ధం చేసుకోవాలి. వీరసింహా రెడ్డి ప్రస్తుతం 65 కోట్ల మేర షేర్ రాబట్టగా వాల్తేరు వీరయ్య 100 కోట్ల షేర్ వైపుగా వెళ్తుంది.

దీనితో అయితే చిరు మాత్రం బాలయ్యని ఈసారి భారీ మార్జిన్ తో దాటేసారు. ఇక ఈ రెండు సినిమాల్లో అయితే శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా మైత్రి మేకర్స్ వారే నిర్మాణం వహించారు.