“వాల్తేరు వీరయ్య”కి అప్పుడే అంత లాభం వచ్చిందా.?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా వీరితో పాటుగా మాస్ మహారాజ రవితేజ మరియు క్యాథెరిన్ లు మరో హీరో హీరోయిన్ లు గా నటించిన లేటెస్ట్ సంక్రాంతి సూపర్ హిట్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. యంగ్ దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ సినిమా మెగా అండ్ మాస్ అభిమానులు మంచి ట్రీట్ ఇచ్చి భారీ సక్సెస్ అయ్యింది.

దీనితో వసూళ్లు పరంగా మొదటి వారం రోజుల్లోనే ఆల్ మోస్ట్ సినిమా బిజినెస్ ని రాబట్టేసిన ఈ చిత్రం ఇక ఈ పది రోజుల్లో అయితే లాభాలు కూడా చాలా చోట్ల అందించడం మొదలు పెట్టింది. మరి ఈ సినిమాని నైజాం లో సినిమా నిర్మాతలే సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోగా అక్కడ కాసుల పంట వాల్తేరు వీరయ్య పండించింది.

ఇక ఉత్తరాంధ్ర తదితర ప్రాంతాల్లో కూడా భారీ లాభాలు అందిస్తున్న వాల్తేరు వీరయ్య ఓవర్సీస్ వసూళ్లతో కలిపి ఇప్పటివరకు 10 కోట్లకి పైగానే లాభాలు అందించింది అట. మరి ఈ సినిమాకి 90 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరగ్గా 100 కోట్ల షేర్ ని ఈ చిత్రం ఆల్రెడీ దాటింది.

దీనితో 10 కోట్లకి పైగా లాభం ఆల్రెడీ వచ్చింది. ఇక దీనితో పాటుగా ఇంకా మరింత నమోదు అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా మాత్రం వాల్తేరు వీరయ్య ఫైనల్ రన్ కి మరిన్ని లాభాలు అందిస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఇంకా ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.