వైజాగ్ సింగిల్ స్క్రీన్ లో “వాల్తేరు వీరయ్య” ఆల్ టైం రికార్డు.!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన టాలీవుడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యి అప్పటి అన్ని సినిమాలని మించి భారీ మార్జిన్ లతో అందుకొని మెగాస్టార్ కెరీర్ లో మరో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.

మరి ఆల్రెడీ 200 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా ఇప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు నమోదు చేస్తూ దూసుకెళ్తున్న ఈ సినిమా మెగాస్టార్ కి సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో చూపించింది. కాగా ఈ సినిమా అయితే లేటెస్ట్ గా వైజాగ్ లో మోస్ట్ ఫేమస్ సింగిల్ స్క్రీన్ అయినటువంటి జగదాంబ 70 ఎం ఎం లో ఆల్ టైం నాన్ రాజమౌళి రికార్డు సెట్ చేసిందట.

ఈ సినిమా రిలీజ్ అయ్యిన కేవలం 22 రోజుల్లో ఏకంగా ఈ ఒక్క స్క్రీన్ నుంచే 1 కోటి రూపాయల గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలిసింది. దీనితో ఇంత తక్కువ సమయంలో రాజమౌళి సినిమాలు కాకుండా నెలకొల్పిన మొట్టమొదటి రికార్డు కూడా మెగాస్టార్ పేరిటే నమోదు కావడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిగా మారగా మెగా ఫ్యాన్స్ లో నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది.

దీనితో మెగాస్టార్ మాత్రం ఈ ఎరా లో తన మ్యానియా ఏ లెవెల్లో చూపిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. కాగా ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా కీలక పాత్రలో నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు మైత్రి మేకర్స్ ఈ సినిమాతో తమ కెరీర్ లోనే భారీ లాభాలు అందుకున్నారు.