పెళ్లి చేసుకుని ఏం పీకాలి.. వివి వినాయక్ సెన్సేషనల్ కామెంట్స్

సినిమాలను చూసి మనం బాగానే ఎంజాయ్ చేస్తాం. కానీ సినీ ఇండస్ట్రీ అంటే ఏదో తెలియని భయం ఉంటుంది. హీరోలు హీరోయిన్లు ఆర్టిస్ట్‌లంటే ఎక్కడో ఏదో ఒక దురభిప్రాయం అందరిలోనూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి పిల్లను ఇవ్వాలంటే సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఇదే విషయంలో వివి వినాయక్‌కు ఇంట్లో వాళ్లకు వాదనలు వచ్చాయట. వివి వినాయక్ మొదటగా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో యేళ్లు ఎదురుచూసి దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే.

అయితే వినాయక్ దర్శకుడిగా మారకముందు ఎన్నో అవమానాలు ఎదురుచూశాడట. వినాయక్‌ ముద్దు పేరు నాని అట. తన తండ్రి అలాగే పిలిచేవాడట. ఇక అది అలాగే స్థిరపడిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇక ఇండస్ట్రీలోకి వెళ్తే సంబంధాలు రావు పిల్లను ఇవ్వరు అంటూ పెళ్లి చేసుకోవాలని తన తండ్రి ఒత్తిడి చేసేవారట. అయితే పెళ్లి చేసుకుని ఏం పీకాలి.. ఇప్పుడే ఎందుకు పెళ్లి చేసుకోవడమంటూ తండ్రితో గొడవ పెట్టుకున్నానని వినాయక్ చెప్పుకొచ్చాడు.

ఆది సినిమాతో దర్శకుడి వినాయక్ తెలుగు చిత్ర సీమలో తనదైన ముద్ర వేశాడు. మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. అదే సమయంలో పెళ్లి చేసుకుని సెటిలయ్యాడు. అయితే ఈ మధ్య వినాయక్ టైం అస్సలు బాగోలేదు. ఏ సినిమా చేసినా అది వర్కవుట్ అవ్వడం లేదు. ప్రస్తుతం హీరోగా మారి శీనయ్యగా రాబోతోన్నాడు. కానీ అది కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది.