VJ Sunny Remuneration : ‘బిగ్ బాస్’లో సన్నీ ఎంత వెనకేసుకున్నాడు ?

VJ Sunny Remuneration: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ గా ఖమ్మం కుర్రాడు వీజే సన్నీ కొత్త చరిత్ర సృష్టించాడు. ఒక్కసారి సన్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే కత్తిపోట్లు, గొడవలు, ఆగ్రహ జ్వాలలు, వరస్ట్ పర్ఫార్మర్ టాగ్ లు, గిల్టీ బోర్డులు వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున తో చివాట్లు.. ఇవే ముఖ్యంగా కనిపిస్తాయి. కానీ, సన్నీ అభిమానులకి అతడు చేసిన గోల, హడావిడి, అమాయకత్వం, టాస్కులు గెలిచే ధీరుడు, కల్మషం లేని మనసు, స్నేహానికి ప్రాణమిచ్చే గుణం, అంతకు మించి చెప్పాలంటే మల్టీ టాలెంటెడ్, బెస్ట్ ఎంటెర్టైనెర్ గా కనిపిస్తాడు.

బిగ్ బాస్ లో తనకి మైనస్ లుగా ఉన్న వాటిని ప్లస్సులుగా మార్చుకుని గెలుపు తలుపులు తట్టాడు వీజే సన్నీ. అప్నా టైం ఆయేగా అనే సన్నీ కి నిన్నటి (ఆదివారం) నుండి తన టైం నిజంగానే వచ్చేసింది. బిగ్ బాస్ టైటిల్ ని ముద్దాడాలన్న అతని కల నిజమైంది. ఎంతో కస్టపడి మొత్తానికి తాను అనుకున్నది అయితే సాధించాడు.

బిగ్ బాస్ టైటిల్ విజేతగా సన్నీ ఎలాగో రూ. 50 లక్షల ప్రైజ్ మని అయితే సంపాదించుకున్నాడు. దాంతో పాటుగా సువర్ణభూమి అందించే రూ. 25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా టీవీఎస్ అందించే అపాచీ స్పోర్ట్స్ బైక్ ని కూడా సంపాదించుకున్నాడు.

అయితే వీటన్నితో పాటు సన్నీ కంటెస్టెంట్ గా ఎంత రెమ్యూనరేషన్ పుచ్చుకున్నాడు అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సన్నీ కి ఉన్న పాపులారిటీ ని చూసి బిగ్ బాస్ యాజమాన్యం తనకు వారానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చారని సమాచారం. అంటే మొత్తం 15 వారాల్లో సన్నీ రూ.30 లక్షలు సంపాదించాడన్నమాట.