Vishwak Sen : అర్జున కళ్యాణం సినిమా విశ్వక్ సేన్ ను ప్లాప్ నుంచి గట్టేక్కిస్తుందా…?

Vishwak Sen : ప్రస్తుతం విశ్వక్సేన్ హీరోగా వస్తున్న సినిమా అశోకవనంలో అర్జున కల్యాణం. ఈ సినిమాకు విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహిస్తుండగా, ‘ఎస్.వి.సి.సి డిజిటల్’ బ్యానర్‌ పై, బీవీయస్ఎన్ ప్రసాద్ సమర్పణలో, బాపినీడు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పాగల్ సినిమా తర్వాత విశ్వక్సేన్ హీరోగా వస్తున్న అర్చన కళ్యాణం సినిమా మీదనే విశ్వక్ సేన తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమా లో విశ్వక్సేన్ కు హీరోయిన్ గా రుక్సార్ థిల్లాన్ నటిస్తోంది.రుక్సార్ థిల్లాన్  ఇదివరకు ‘కృష్ణార్జున యుద్ధం’ ‘ఎబిసిడి’ సినిమాలలో నటించింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంతకు ముందు విడుదల చేసిన టీజర్ తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమా మీద అంచనాలు పెంచాయి.30 ఏళ్ళ వయసు వచ్చినా పెళ్ళికాని యువకుడు అల్లం అర్జున్‌కుమార్ గా ఈ మూవీలో విశ్వక్ సేన్ కనిపించనున్నాడు.పెళ్లి కోసం ఓ యువకుడు పడే అవస్థలను ఈ మూవీలో ఫన్నీ గా చూపించారు.ట్రైలర్ ప్రకారం అమాయకుడైన హీరోకి తన కులంలోని పిల్లనే ఇచ్చి పెళ్లి చేయాలనేది ఇంట్లో వాళ్ళ పట్టింపు. అందుకోసం రాష్ట్రం దాటి తెలంగాణ అమ్మాయిని వెతికి పట్టుకుంటారు. పెళ్ళి చూపులయ్యయి, పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది.కానీ హీరోయిన్ కీ నచ్చలేదు అని చెప్పడం తో ఎమోషనల్ సీన్ లు స్టార్ట్ అవుతాయి.

YouTube video player

కానీ ఇంత సీరియస్ లో కూడా నవ్వులు పూయించే సన్నివేశాలు కనిపిస్తాయి.ఈ సినిమాలో విశ్వక్ సేన్ కూడా కొత్తగా వున్నారు. ఇక ట్రైలర్ లో కూడా మాస్ క దాస్ ను కాస్త… క్లాస్ క దాస్ గా అని సినిమాలో విశ్వక్ సేన్ గురించి చెప్పకనే చెప్పారు. మే 6న సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విశ్వక్సేన్ కీ హిట్ ఇస్తుందనే ట్రైలర్ చూశాక అభిప్రాయపడుతున్నారు.