Viswak Sen : అశోక వనంలో అర్జున కళ్యాణం ఓటీటీ విడుదల ఎప్పుడంటే…!

Vishwak Sen : వర్ధమాన తెలుగు యువ హీరోల్లో ఒకరు విశ్వక్ సేన్. ఇపుడిపుడే తెలుగు సినిమా పరిశ్రమలో గుర్తింవు తెచ్చుకుంటున్న విశ్వక్ సేన్. తన సినిమాలు ఫలక్ నుమా దాస్, హిట్, పాగల్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.ఇక ఈ సినిమా ను విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించారు.విశ్వక్ కు జోడిగా రుక్షర్ ఢిల్లన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ సినిమాను ఎస్విసిసి బ్యానర్ పై బాపినీడు బి, సుధీర్ ఈదర నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22 నా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే సినిమా విడుదల తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ఓటీటీ లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఓటీటీ పార్టనర్ గా ఆహా ఒరిజినల్స్ ముందుకు వచ్చింది. ఈ విషయాన్నీ ఆహా ఒరిజినల్స్ ఒక వీడియో ద్వారా పేర్కొంది.

విశ్వక్ సేన తన తదుపరి చిత్రం దాస్ కా దుమకీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు దర్శకుడిగా కనిపించనున్నాడు విశ్వక్ . ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా మరోసారి పాగల్ బ్యూటీ నీవేదా పితురాజ్ జోడి కడుతోంది. ఇక ఈ సినిమా కు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు.