విశాల్‌ ‘రత్నం’ మూవీ విడుదలకు సిద్దం!

తమిళ హీరో విశాల్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్‌ ఉంది. ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఇష్టపడతారు. కారణం ఆయన తెలుగు నటుడే కావడం. కాకపోతే.. తమిళ ఇండస్ట్రీలో సెటిల్‌ అయ్యారు. అందుకే విశాల్‌ సినిమా కోసం తెలుగు ఆడియన్స్‌ కూడా ఎదురుచూస్తూ ఉంటారు. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘రత్నం’. మాస్‌ అండ్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు హరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ కంటెంట్‌ వస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆడియన్స్‌ ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా రిలీజ్‌ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్‌ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్‌. ‘రత్నం’ సినిమా ఏప్రిల్‌ 26న థియేటర్స్‌ లోకి రానున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. దీంతో విశాల్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

సమ్మర్‌ లో విశాల్‌ మాస్‌ సంభవం చూడబోతున్నారు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమాకు రాక్‌ స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబందించిన ప్రమోషన్‌ పనులు కూడా త్వరలోనే మొదలుకానున్నాయి. వాటిలో భాగంగా.. ముందుగా రత్నం టీజర్‌ రిలీజ్‌ చేసి, ఆ తరువాత వరుసగా సాంగ్స్‌ రిలీజ్‌ చేసి సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌.

ఇక విశాల్‌ నుండి వచ్చిన గత చిత్ర మార్క్‌ ఆంటోనీ బాక్సాఫీస్‌ దగ్గర మంచి విజయం సాధించింది. దీంతో రత్నం సినిమాపై అంచనాలు క్రియేట్‌ అవుతున్నాయి. అలాగే సినిమా కూడా ఉంటుందని, ఖచ్చితంగా విశాల్‌ కెరీర్‌ లో మరో బ్లాక్‌ బస్టర్‌ కన్ఫర్మ్‌ అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌. మరి నిజంగా ఈ సినిమా విశాల్‌ కు మరో హిట్టు అందిస్తుందా అనేది తెలియాలంటే మరో రెండు నెలల ఆగాల్సిందే.