ఓటిటిలోకి విశాల్‌ ‘రత్నం’

తమిళ నటుడు విశాల్‌ చాలా రోజులు తర్వాత ‘రత్నం’ అంటూ ఊరమాస్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ‘సింగం’ చిత్రాల ఫేమ్‌ హరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ప్రియా భవానీ శంకర్‌ కథానాయికగా నటించింది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్‌ వైడ్‌గా ఏప్రిల్‌ 26న విడుదల చేయగా.. బాక్సాఫీస్‌ వద్ద మోస్తరు విజయం అందుకుంది.

అయితే ఈ చిత్రం విడుదలై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆంధప్రదేశ్‌, తమిళనాడు బోర్డర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా స్టోరీ ఉండగా.. సముద్రఖని, యోగిబాబు, గౌతమ్‌ వాసుదేవ్‌ విూనన్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి నేషనల్‌ అవార్డు విన్నర్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించాడు.