లేటెస్ట్ గా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గరకి వచ్చి భారీ హిట్ గా నిలిచిన లేటెస్ట్ చిత్రం “విక్రమ్”. తమిళ స్టార్ హీరో ఉలగ నాయగన్ కమల్ హాసన్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ కాంబోలో తెరకెక్కించిన ఈ భారీ ఏక్షన్ క్రేజీ ఎంటర్టైనర్ రికార్డు వసూళ్లతో దక్షిణాది రాష్ట్రాల్లో దూసుకెళ్తుంది.
ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం ఒక్క ఇండియా లోనే కాకుండ పలు దేశాల్లో కూడా ఏ తమిళ్ సినిమా ఈ ఏడాదిలో పెర్ఫామ్ చెయ్యని విధంగా రాణిస్తున్నట్టు ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉండగా దాదాపు నాలుగేళ్ల నుంచి యూఎస్ బాక్సాఫీస్ దగ్గర తమిళ సినిమాలకు దూరంగా ఉన్న 2 మిలియన్ డాలర్స్ క్లబ్ లో ఈ చిత్రం చేరి ఐదో తమిళ సినిమాగా అరుదైన రికార్డును నెలకొల్పింది.
అంతే కాకుండా కమల్ నుంచి ఫస్ట్ సినిమాగా 2 మిలియన్ డాలర్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతానికి అయితే టాప్ 5 లో ఉన్న ఈ చిత్రం లాంగ్ రన్ లో టాప్ 4 కి చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే మిగతా టాప్ అన్ని స్థానాల్లో కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలే ఉండడం విశేషం.
మొత్తానికి అయితే విక్రమ్ చాలా ఏళ్ళకి తమిళ్ సినిమాల నుంచి దూరంగా ఉన్న 2 మిలియన్ మార్క్ ని అందుకొని అరుదైన రికార్డు అందుకున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. దీనితో తమిళ సినిమా ఆనందం వ్యక్తం చేస్తుంది.