సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా జీ.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘ సర్కారు వారి పాట ‘. పరశురాం దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతమందిస్తున్నాడు. జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్ధిక నేరస్తుడిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. దేశంలో జరుగుతున్న బ్యాంక్ కుంభకోణం బ్యాక్ డ్రాప్ లో పరశురాం ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడని అంటున్నారు. యూనివర్సల్ పాయింట్ తో తెరకెక్కే ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో నిర్మిస్తున్నారట. తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా ఈ సినిమా తర్వాత మహేష్ బాబు – దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక పాన్ ఇండియన్ సినిమా రూపొందబోతోంది. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై డా. కే.ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ – రాం చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే రెండు పాత్రలకి సంబంధించిన టీజర్స్ అటు నందమూరి అభిమానులు ఇటు మెగా అభిమానుల తో పాటు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ విషయం ఇద్దరు వెల్లడించారు. కాగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సిద్దం చేస్తున్నారట. ఈ సినిమా ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా తెరకెక్కనుందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఇలాంటి సినిమాలు చాలానే చేశారు. కాని మహేష్ గనక ఈ కథ ఒప్పుకుంటే మాత్రం భారీ అంచనాలు నెలకొనడం ఖాయం అంటున్నారు.