టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. గ్యాప్ వచ్చినా తన నటనలో ఎలాంటి మార్పు రాలేదని, సవాల్‌తో కూడిన ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్దం అన్నట్లు దర్శకనిర్మాతలకు సవాల్ విసిరింది. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంలో కీలకపాత్రలో మెప్పించినప్పటికీ ఇప్పటివరకు మరో చిత్రానికి ఆమె సైన్ చేయలేదు. ఆమెతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు వెనకాడుతున్నారా లేక విజయశాంతినే సినిమాలకు దూరంగా ఉంటున్నారో తెలియడం లేదు.
ఇదే నిజమైతే విజయశాంతి లాంటి స్టార్ నటిని రోజు టీవీల్లో చూడొచ్చని అటు ఆమె ఫ్యాన్స్‌తో పాటు సీరియల్స్ ప్రేక్షకులు తెగ ముచ్చటపడుతున్నారు. అయితే ఆమె సీరియల్స్‌లో నటిస్తారా లేక ఇవన్నీ కల్పిత వార్తలా తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.