Vijay Thalapathy : లాంఛనంగా మొదలైన విజయ్ తెలుగు సినిమా…!

Vijay Thalapathy: తమిళ్ హీరో ఐన విజయ్ తలపతి కి తమిళ్ లో నీ కాదు తెలుగు లో అభిమానులు వున్నారు. విజయ్ నటించిన తమిళ్ సినిమాలు తెలుగు లో డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. తుపాకీ వంటి సినిమాలు తెలుగు లో మంచి విజయాలను అందుకున్నాయ్. కానీ ఇంతవరకు తెలుగు లో డైరెక్ట్ మూవీ చేయలేదు విజయ్. తాజాగా విజయ్ తెలుగు లో డైరెక్ట్ మూవీ చేయబోతున్నట్లు వార్తలు ఐతే వినిపించాయి.ఈ నేపథ్యంలో విజయ్ తొలిసారి తెలుగులో స్ట్రెయిట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తెలుగు తమిళ భాషల్లో బై లింగ్వల్ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పీవీపీ సినిమా బ్యానర్స్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో విజయ్ కు జోడి గా నేషనల్ క్రష్ రష్మిక నటిస్తున్నారు.ఈ సినిమాలో విజయ్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారట.ఈ సినిమాని బుధవారం లాంఛనంగా చెన్నైలో ప్రారంభించారు. బుధవారం నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది.

బీస్ట్ సినిమా తర్వాత ఈ సినిమా రావడం తో దీనిమీద అంచనాలు కూడా ఎక్కువగా వున్నాయ్.సంగీత సంచలనం థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లేని వంశీ పైడిపల్లి, హరి అహిషోర్ సాల్మన్ (వైల్డ్ డాగ్ డైరెక్టర్) అందిస్తుండటం విశేషం.ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్ 5 రోజులు సాగనుందట. ఈ షెడ్యూల్ లో ఓ పాటని చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. తమిళ్ సూపర్ స్టార్ అయిన విజయ్ తెలుగు లో ఇలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.