రికార్డుల మోత మోగిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌..!

ఓటీటీల్లో క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌ మూవీస్‌కు ఉండే డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి నటించిన మహారాజా మూవీ రికార్డులు సృష్టిస్తుంది. అతని కేరీర్లో 50 వ సినిమాగా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చి రికార్డులను క్రియేట్‌ చేస్తూనే ఉంది. 2024 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది చూసిన ఇండియన్‌ సినిమాగా విజయ్‌ సేతుపతి నటించిన మహారాజా నిలిచింది.

నిథిలన్‌ సామినాథన్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయి వారాలు అవుతున్నా ఇప్పటికీ టాప్‌ 10 ట్రెండిరగ్‌ మూవీస్‌లో ఉంది. అది కూడా 8 దేశాల్లో ఉండటం మరో ఘనత. 2024 నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డ్‌ క్రియేట్‌ చేసిన క్రూ, లాపతా లేడీస్‌, సినిమాలను వెనక్కి నెట్టి మహారాజా ముందుకు దూసుకొచ్చాడు. ఇప్పటి వరకూ ఈ సినిమాకి 1.86 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. దీనికి ముందు క్రూ మూవీకి 1.79 వ్యూస్‌ రాగా, లాపతా లేడీస్‌కు 1.71 కోట్లు వ్యూస్‌ వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్లలో రికార్డులు కొళ్లగొట్టాయి.

అయితే ఇప్పుడు అలాంటి సినిమాలను విజయ్‌ సేతుపతి మహారాజాతో వెనక్కి నెట్టాడు. ఈ సిమాలో అతనితోపాటు బాలివుడ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్చప్‌, భారతీరాజా, అభిరామ్‌, మోహన్‌ దాస్‌ తదితరులు నటించారు. ఈ సినిమాకు కాంతారా ఫేమ్‌ అజనీస్‌ లోకనాథ్‌ సంగీతాన్ని అందించాడు. మహారాజా ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి సాధారణ బార్బర్‌గా నటించాడు. ఓ సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లో చొరబడి తమ జీవితాల్లో ఎంతో ముఖ్యమైన లక్ష్మిని ఎత్తుకెళ్లారని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాడు మహారాజా.

అసలు ఆ లక్ష్మి అన్నది సినిమాలో పెద్ద ట్విస్ట్‌గా ఉంటుంది. కథ మొత్తం దాని చుట్టూ తిరుగుతూ సస్సెన్స్‌లతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీని ప్రేక్షకులు ఊహకందని విధంగా ట్విస్టుల మీద ట్విస్టులతో డైరెక్టర్‌ రూపొందించాడు. సినిమా స్టార్టింగ్‌ నుంచి చివరి వరకు ప్రతి సీన్‌ ఎంతో ఉత్కంఠ రేపుతోంది.

ఇది తెలిసిన స్టోరియే అనుకొనే లేపో ట్విస్టులతో పిచ్చెక్కిస్తుంది. ఇది సినిమాకు బిగ్గెస్ట్‌ ప్లస్‌ పాయింట్‌. దీని కారణంగానే థియేటర్‌తో పాటు ఓటీటీల్లో దూసుకుపోతుంది. ఈ సినిమాలో విలన్‌గా బాలివుడ్‌ డైరెక్టర్‌ నటించడం ప్రధాన బలం. ఆయన విజయ్‌ సేతుపతితో పోటీపడి నటించాడు. ఓ చిన్న మిస్‌ అండర్‌ స్టాండిరగ్‌ జీవితాలను ఎలా మారుస్తుంది అనేది ఈ సినిమాలో చూడొచ్చు.