ఓటిటి : విజయ్, సామ్ ల “ఖుషి” వచ్చేస్తుంది.. 

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన పలు హిట్ చిత్రాల్లో అయితే నష్టాలు మిగిల్చినా కూడా హిట్ స్టేటస్ తెచ్చుకున్న చిత్రం “ఖుషి” కూడా ఒకటి. సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత నటించింది.

ఐతే ఈ సినిమా మొదట పెద్దగా అంచనాలు నెలకపోయినప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం ఊహించని విధంగా సమంత విజయ్ ల కెరీర్ లో అదిరే లెవెల్లో అందుకుంది. కాగా ఈ చిత్రం ఇప్పుడు ఏపీలో మినహా అన్ని చోట్ల కూడా లాభాలనే ఇచ్చింది. ఇంట్రెస్టింగ్ ఈ చిత్రం తమిళనాడులో ఇప్పటికీ మంచి అక్యుపెన్సీతో రన్ అవుతుందట.

కాగా ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా ఓటిటి రాకకి అయితే డేట్ ఫిక్స్ అయ్యినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా తాలూకా డిజిటల్ హక్కులు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కి రానుంది అని ఫిక్స్ అయ్యింది.

కాగా సినిమా కూడా సెప్టెంబర్ 1న రిలీజ్ అయితే జస్ట్ ఒక్క నెల గ్యాప్ లోనే సినిమా వచ్చేస్తుంది అని చెప్పాలి. కాగా ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఒరిజినల్ తెలుగు కాకుండా తమిళ్, మలయాళం అలాగే కన్నడ, హిందీ భాషల్లో మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.