Dil Raju : దిల్ రాజు ఏమో అలా…విజయ్ ఏమో ఇలా…ఇంతకీ దళపతి సినిమా తెలుగు సినిమానా డబ్బింగా…!

Dil Raju : కోలీవుడ్ దళపతి విజయ్ తెలుగులో వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్. ఇక ఈ సినిమా ను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నామని దిల్ రాజు ఇంటర్వ్యూ ల్లో చెప్పారు. అయితే ఈ సినిమా ద్విభాషా చిత్రం కాదు తెలుగులోకి అనువాదం అవుతుంది అంటూ బాంబు పేల్చాడు హీరో విజయ్.

ఇక ఎపుడు ప్రేక్షకులలో సందేహాలు మొదలయ్యాయి. అసలిది స్ట్రైట్ తెలుగు సినిమానా లేక డబ్బింగా అని. విజయ్ కెరీర్లో ఇది హైయెస్ట్ బడ్జెట్ గా రూపొందుతోంది . ఈ మూవీ కోసం అతను దాదాపు రూ.70 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి. ద్విభాషా చిత్రం కాబట్టి ఇక తమిళం లో విజయ్ మార్కెట్ దాదాపు 200 కోట్లు కాబట్టి పారితోషికం ఆమాత్రం ఉంటుందని అంచనా వెయ్యొచ్చు.

బీస్ట్’ ప్రమోషన్లలో భాగంగా విజయ్ పాల్గొన్న ఇంటర్వ్యూలో దిల్ రాజు- వంశీ పైడిపల్లి మూవీ పై అతను స్పందించాడు. మీకు టాలీవుడ్లో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు స్ట్రైట్ తెలుగు మూవీ చేస్తున్నారు ఎలా ఫీలవుతున్నారు? అంటూ యాంకర్ ప్రశ్నించగా. అందుకు విజయ్ ‘ఇది ద్విభాషా చిత్రం కాదు. నా గత సినిమాల్లానే ఇది కూడా తెలుగులో డబ్ అవుతుంది అంతే’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. దీంతో దిల్ రాజు గాలి తీసేసినట్టు అయ్యింది.

ఇక విజయ్ నేరుగా తెలుగు సినిమా మాస్టర్ సమయం. లోనే తీయాల్సి ఉన్నా మైత్రి మూవీ మేకర్స్ తో అనుకున్న అది కుదరలేదు ఎపుడు దిల్ రాజు మధ్యలో వచ్చాడు. అయితే ఇది నేరుగా తెలుగు సినిమానా లేక డబ్బింగ్ సినిమానా తెలియాలంటే దిల్ రాజు లేక వంశీ పైడిపల్లి స్పందించాలి.