దమ్మున్న విజయ్ దేవరకొండ..బట్టలు లేకుండా షాకింగ్ పోస్టర్ తో రచ్చ.!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో తన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా “లైగర్” కూడా ఒకటి. మాస్ అండ్ స్టైలిష్ దర్శకుడు పూరి జగన్నాద్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో కాకుండా వరల్డ్ లెవెల్ హంగులతోనే తెరకెక్కింది.

ఎందుకంటే ఈ సినిమాలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ అయినటువంటి మైక్ టైసన్ ని కూడా ఈ సినిమాలో దింపారు. అందుకే వరల్డ్ లెవెల్ ఇంపాక్ట్ ఈ సినిమాపై అయితే వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఈ ఆగష్టు లో రిలీజ్ కి సిద్ధం అవుతుండగా ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ అయితే అదిరే లెవెల్లో స్టార్ట్ చేశారు.

మరి ఈరోజు డైరెక్ట్ గా విజయ్ దేవరకొండ తోనే స్టార్ట్ చేసిన మేకర్స్ తన నుంచి మాత్రం ఒక ఊహించని పోస్టర్ ని రిలీజ్ చేసారని చెప్పాలి. దీనితో విజయ్ దేవరకొండ దమ్ము కూడా ప్రూవ్ అయ్యిందని చెప్పాల్సిందే. విజయ్ తన ఆరు పలకల దేహాన్ని చూపించడం ఒకెత్తు అయితే అందులో ఒక బొకే పట్టుకొని తన నడుం కింద కవర్ చేస్తూ పోజ్ ఇవ్వడం షాకింగ్ గా మారింది.

అంత షాకింగ్ ఎందుకు అంటే ఆ బొకే వెనుక అసలు ఎలాంటి బట్టలు కూడా లేవు. ఈ తరహా పోస్టర్ అప్పట్లో పీకే సినిమాకి గాను అమీర్ ఖాన్ చేసే సాహసం చేయగా ఇప్పుడు విజయ్ దేవరకొండ చేసాడు. అంత స్టార్డం తో ఇలా చేయడం అనేది అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. దీనితో ఇప్పుడు ఈ పోస్టర్ మోస్ట్ సెక్సియెస్ట్ పోస్టర్ గా వైరల్ అవుతుంది.