ఇన్సైడ్ టాక్ : కాపీ స్టోరీతో రాబోతున్న “ఖుషి”.?

ఇప్పుడు టాలీవుడ్ లో రాబోతున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో యంగ్ హీరో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సమంతా హీరోయిన్ గా నటిస్తున్న లవ్ స్టోరీ “ఖుషి” కూడా ఒకటి. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తుండగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కి రాబోతుంది.

అయితే ఈ చిత్రం నుంచి ఇప్పుడు ఒకో పాట కూడా మేకర్స్ రిలీజ్ చేస్తుండగా వీటికి మంచి స్పందన అయితే వస్తుంది. ఇక నిన్న రిలీజ్ అయ్యిన రెండో సాంగ్ కి అలాగే మొదటి సాంగ్ కూడా కాస్త డిఫరెన్స్ కనిపిస్తుంది. అందులో హీరో హీరోయిన్ ని ముస్లిమ్ గా చూపించడం అప్పుడు ఆసక్తిగా మారింది.

ఐతే ఇప్పుడు కొత్త సాంగ్ లో ఇద్దరు కొలీగ్స్ కాగా ఒకే దగ్గర పని చేస్తూ లవ్ లో ఉన్నట్టు చూపించారు. అయితే మరి సినిమాలో కాశ్మిర్ నేపథ్యం ఎలా వచ్చింది అనే టాక్ కి వస్తే.. సినిమాలో సమంత ఎదో ప్రాజెక్ట్ మీద కాశ్మిర్ ప్రాంతానికి వెళ్తే టెర్రరిస్ట్ లకి చిక్కుతుంది. అందుకు ఆమెని తీసుకురావడానికి హీరో వెళ్లాడని సోషల్ మీడియాలో స్టోరీ.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా కథ అయితే ఆల్రెడీ బాలీవుడ్ లో ఉందని దాని నుంచే కాపీ కొట్టి తీస్తున్నారని నెటిజన్స్ అంటున్నారు. కాపీ కొట్టిన స్టోరీ కి కూడా ఇంత హంగామా అవసరమా అంటూ పెదవి విరుస్తున్నారు. మరి ఇది కాపీ స్టోరీనా లేక కొత్త కథా అనేది తెలియాలి అంటే ఈ సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.