గోల్డెన్ హార్ట్ విజయ్ దేవరకొండ..100 ఫ్యామిలీస్ కి చెక్కులు 

ప్రెజెంట్ టాలీవుడ్ లో ఉన్న యంగ్ జెనరేషన్ లో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న యంగ్ హీరోస్ లో విఇజాయ్ దేవరకొండ కూడా ఒకడు. అయితే అవ్వడానికి తాను కొన్ని సార్లు అతిగా చేస్తాడు కానీ మనసు పరంగా మాత్రం విజయ్ చాలా సౌమ్యుడు అని చెప్పడంలో సందేహం లేదు.

ప్రమోషన్స్ కోసం ఎన్నో వెటకారాలు చేసినప్పటికీ తన ఫ్యాన్స్ విషయంలో కానీ ఎవరికైనా హెల్ప్ చేయడం విషయంలో కానీ విజయ్ వెనుకాడడు. అలాగే ఇప్పటికే కరోనా సమయంలో చాలా మంది యువతకి తాను అండగా ఉండగా నెక్స్ట్ ఒకసారి ఆర్గాన్ డొనేషన్ క్యాంపు లో తాను తన ఆర్గాన్స్ ని డొనేట్ చేసినట్టుగా కూడా తెలిపాడు.

అయితే మోస్ట్ రీసెంట్ గా మరోసారి అందరి మనసులు విజయ్ గెలిచాడు. తాను ఖుషి హిట్ టూర్ లో వైజాగ్ లో ఇచ్చిన మాట ప్రకారం ఒక 100 కుటుంబాలకి ఒక లక్ష చొప్పున అందిస్తున్నట్టుగా అనౌన్స్ చేసాడు. కాగా ఈ వెంటనే అందుకు అప్లై చేసుకోడానికి లింక్ కూడా పెట్టగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది.

మరి ఇప్పుడు అయితే తాను ఓ 100 కుటుంబాలని ఎంపిక చేసినట్టుగా విజయ్ తెలిపాడు. మొత్తం వంద మంది లిస్ట్ ని పిక్స్ గా రిలీజ్ చేసి వారు అందరికీ లక్ష చొప్పున చెక్కు పంపిణీ చేయనున్నాడు అని సినీ వర్గాలు కూడా ఇపుడు కన్ఫర్మ్ చేసాయి. దీనితో విజయ్ దేవరకొండపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. 
https://x.com/TheDeverakonda/status/1702196086260326507?s=20