ఇండస్ట్రీ టాక్ : విజయ్ “ఫ్యామిలీ స్టార్” రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారా?

తెలుగు సినిమా దగ్గర హీరోగా పరిచయం అయ్యిన కొన్నేళ్ల లోనే మంచి స్టార్ స్టేటస్ ను తెచ్చుకున్న యంగ్ హీరోస్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఒకడు. అయితే తన కెరీర్ స్టార్టింగ్ లో హీరో కాక ముందు చేసిన సినిమాలతో అంత గుర్తింపు రాలేదు కానీ తనకి ఒక్కసారి బ్రేక్ వచ్చాక మాత్రం తాను తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఒకో సినిమాకి మంచి హైప్ ని జెనరేట్ చేసుకుంటున్నాడు.

కాగా అలా ఇప్పుడు తాను చేస్తున్న ఓ ఫామిలీ మాస్ డ్రామానే “ఫ్యామిలీ స్టార్”. తన హిట్ దర్శకుడు పరశురామ్ పెట్ల తో రెండో సినిమాగా దీనిని చేస్తుండగా మంచి అంచనాలే దీనిపై కూడా ఫస్ట్ గ్లింప్స్ తో నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం రిలీజ్ నిజానికి ఈ జనవరి సంక్రాంతి బరిలోనే ఉండాల్సింది.

కానీ పలు కారణాల మూలాన ఆపేసారు. కాగా కొత్త డేట్ లోకి మారుస్తారు అని ఊహాగానాలు ఎప్పుడు నుంచో ఉండగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా కొత్త డేట్ వైరల్ అవుతుంది. దీనితో ఈ సినిమా ఈ ఏడాది మార్చ్ 22న రిలీజ్ చేసే సన్నాహాలు నిర్మాత దిల్ రాజు చేస్తున్నట్టుగా వినిపిస్తుంది.

కాగా దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక రీసెంట్ గానే విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో హిట్ అందుకేగా తన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హాయ్ నాన్న తో భారీ హిట్ ని అందుకుంది.