సమంతపై విజయ్ క్రేజీ స్టేట్మెంట్ వైరల్.!

ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న మంచి మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ పెయిర్ లలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ అలాగే స్టార్ హీరోయిన్ సమంత ల జంట కూడా ఒకటి. ఇక ఈ కాంబినేషన్ లో ఆల్రెడీ ఓ చిత్రం రాగా దీని తర్వాత ఫుల్ గా తాము హీరో హీరోయిన్స్ గా చేసిన లేటెస్ట్ చిత్రమే “ఖుషి”.

దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుండగా ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్స్ లో అయితే బిజీగా ఉంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ సమంత పై చేసిన ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ వైరల్ గా మారింది.

మరి ఏమన్నాడంటే తనకి సమంతపై పై క్రష్ ఉందని అయితే ఇది తనకి ఎప్పటి నుంచో ఉంది అని అలాగే ఈ క్రష్ ఎప్పటికీ పోదేమో అని కూడా కామెంట్స్ చేసాడు. దీనితో ఈ క్రేజీ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో సహా నేషనల్ ఎంటర్టైనింగ్ మీడియాలో కూడా వైరల్ గా మారిపోయింది.

మరి దీనితో కొందరు కొన్ని రకాలుగా కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక వీరి కాంబినేషన్ లో వస్తున్నా ఖుషి మూవీ అయితే ఈ సెప్టెంబర్ 1 న రిలీజ్ కాబోతుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు అలాగే పాన్ ఇండియా వైడ్ అయితే ఈ చిత్రం ఆరోజు రిలీజ్ కానుంది. కాగా ఇప్పుడు ట్రైలర్ తో పెద్ద బజ్ ఏమి సినిమాకి రాలేదు. సో పాన్ ఇండియా రిలీజ్ డౌటే అని సినీ వర్గాలు చెప్తున్నాయి.