VD: మరో హిట్ కాంబో!

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి అందిరికీ తెలిసిందే. ఈ మధ్య వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న ఆయన.. మరో కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి ఖుషీ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 2023 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ మూవీ గురించి కూడా ఎప్పుడో ప్రకటించాడు.

జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వీడీ12 అనే సినిమా చేయబోతున్నాడు. అయితే ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు. దీన్ని పురస్కరించుకుని ఆయన మరో సినిమాకు సైన్ చేశాడు. అది తన 13వ చిత్రం అని తెలుస్తోంది. శ్యామ్ సింఘ రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

విజయ్ దేవరకొండ మరియు రాహుల్ గతంలో టాక్సీవాలా సినిమా కోసం పని చేశారు. వీరిద్దరి కాంబోలో రాబోయే తదుపరి చిత్రం పీరియాడిక్ డ్రామా అని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్లు ఉండబోతున్నాయని సమాచారం. త్వరలోనే విజయ్ దేవరకొండ 13వ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ తో విజయ్ గతంలో ఓ సినిమా ప్లాన్ చేశారు. కానీ ఆ సినిమా ఔట్ పుట్ పై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ప్రాజెక్టును నిలిపివేశారు. ఈ క్రమంలోనే విజయ్ .. మైత్రీ మూవీ మేకర్స్ కోసం భవిష్యత్తులో ఓ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు. అయితే ఈ వీడీ 13 వీరి కాంబోలోనే తెరకెక్కుతున్న. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎవరెవరు నటిస్తారు అనేది.

మరోవైపు రౌడీ బాయ్ బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమాల పోస్టర్లు, సాంగ్స్ ను ఈరోజు విడుదల చేశారు. ఖుషీ సినిమాలో నా రోజా నువ్వే పాటతో పాటు వీడీ12 పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ రెండు కూడా విజయ్ దేవరకొండ అభిమానుల్లో తెగ ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. నా రోజా నువ్వే సాంగ్ అయితే అదిరిపోయింది. ఖుషీ సినిమాకు ఈ పాటలు ప్లస్సుగా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది.