Vignesh Shivan: నయన్ సామ్ సేతుపతి ల కాంబో సూపర్.. విగ్నేష్ శివన్ పోస్ట్ వైరల్ ..!

Vignesh Shivan: తమిళంలో నయనతార విజయ్ సేతుపతి తో కలిసి ‘కాతు వాకుల రెండు కాదల్‌’ అనే సినిమాతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాకు విగ్నేష్ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్‌, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్‌ 28న ఈ కామెడీ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యిందన్న విషయాన్ని సమంత సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని హామీ ఇచ్చారు. తెలుగులో ఈ చిత్రాన్ని ”కన్మణి రాంబో ఖతీజా” పేరుతో విడుదల చేయబోతున్నారు.

అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల పాట చిత్రీకరణతో పూర్తయ్యింది.  సినిమా చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా దర్శకుడు ట్విట్టర్లో ఫోటోలను షేర్ చేస్తూ తన భావాలను వ్యక్తపరిచారు. ఫోటోలు షేర్ చేస్తూ దీన్ని సాధ్యం చేసిన భగవంతుడికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.అసాధారణ నటీ నటులతో పని చేశానని, అలాంటి వారు దొరకడం నా అదృష్టం, ఒక దర్శకుడికి కలే అని అన్నారు. ఇంతకంటే గొప్ప కాంబినేషన్‌ను ఊహించలేనన్నారు.

ఉత్తమ నటుడు విజయ్‌సేతుపతి, అందమైన ప్రొఫెషనల్‌ నటి నయనతార, ప్రతిభావంతమైన నటి సమంత వీళ్లంతా ఈ చిత్రాన్ని అద్భుతంగా నడిపించారని అన్నారు. చిత్రాన్ని ఈనెల 28వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు.