నయనతార ప్రియుడిని అంతలా వేధిస్తున్నారా.. విఘ్నేష్ శివన్ పోస్ట్ వైరల్

విఘ్నేష్ శివన్ అంటే అందరూ గుర్తుకుపట్టకపోవచ్చు. కానీ నయనతార ప్రస్తుత ప్రియుడంటే మాత్రం అందరూ గుర్తు పడతారు. నయన్ బాయ్ ఫ్రెండ్‌గా విఘ్నేష్‌కు భారీ ఫాలోయింగే ఉంది. ఒకే ఒక్క సినిమాతో నయన్‌ను పడగొట్టేశాడు. నాను రౌడీదానే (నేనూ రౌడీనే) అనే చిత్రాన్ని నయనతార హీరోయిన్‌గా విఘ్నేష్ శివన్ తెరకెక్కించాడు. ఆ మూవీను డైరెక్ట్ చేసే సమయంలోనే నయన్‌ను లైన్‌లోకి దింపేశాడు.

Vignesh shivan ABout His Project Budget Satire,Nayanatara
Vignesh shivan ABout His Project Budget Satire,Nayanatara

అసలే నయన్‌కు ప్రేమ అనేది ఓ కాళరాత్రిలా మారింది. ముందుగా శింబుతో ప్రేమాయణం కొనసాగించింది. ఆపై ప్రభుదేవాతో వ్యవహారం పెళ్లి వరకు వచ్చింది. ఇప్పటికైతే విఘ్నేష్ శివన్ ప్రేమలోనే ఉంది. అయితే విఘ్నేష్‌కు మాత్రం నయన్ ప్రియుడిగానే గుర్తింపు లభిస్తోంది. తనకంటూ దర్శకుడిగా మళ్లీ నిరూపించుకోలేకపోతున్నాడు. నయన్‌ చుట్టూ తిరగడమే సరిపోవడంతో దర్శకుడిగా సినిమాలు చేయడమే లేదు.

ఈ మధ్యే నయన్, సమంతలతో ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని చేసేందుకు రెడీ అయ్యాడు. త్వరలోనే షూటింగ్ కూడా మొదలెట్టబోతోన్నట్టు తెలుస్తోంది. తాజాగా విఘ్నేష్ చేసిన ఓ పోస్ట్ అందరిలోనూ ఆశ్చర్యం కలిగిస్తోంది. వచ్చే వాళ్లు టైటానిక్ షిప్‌లా ఉండాలని అంచనాలు పెట్టుకుంటున్నారు. కానీ వారు ఇచ్చే బడ్జెట్ ఇస్త్రీ పెట్టె అంతే ఇస్తామని చెబుతున్నారంటూ తన బాధను వెల్లగక్కాడు. తన ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇలా సెటైర్ వేశాడా? అని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.