”నేను నిన్ను ప్రేమించాను.. ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను.. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను… నా ప్రియమైన సినిమా” అంటోంది విద్యాబాలన్.
ఎన్నో సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్న ఆమె ఇప్పుడు సినిమా మీద తనుకున్న ప్రేమను చెప్పడానికి ఓ కారణం ఉంది. విద్యాబాలన్ హిందీ తెరకు పరిచయమై 15 ఏళ్లయింది. ఈ 15 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిందట.
సంజయ్ దత్, సైఫ్ అలీఖాన్, రైమా సేన్, దియా మీర్జా, విద్యాబాలన్ తదితరులు నటించిన ‘పరిణీత’ విద్యాకి ఎంతో మంచి పేరు తెచ్చింది. బెంగాలీ మహిళగా ఆ చిత్రంలో చక్కగా నటించారు విద్యాబాలన్. నటిగా 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజనులతో ముచ్చటించింది. తన మనసులోని భావాలను పంచుకుంది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు చక్కగా జవాబులిచ్చింది.
మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? అని నెటిజనులు అడిగితే.. సినిమా మీద తనుకున్న ప్రేమను ఆ విధంగా తెలియజేసింది. దటీజ్ విద్యాబాలన్!