ఆ సినిమా వల్ల సమంత పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి: వేణు స్వామి

వేణుస్వామి ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఈయన గతంలో నాగచైతన్య సమంత గురించి చేసిన వ్యాఖ్యల గురించి అందరికీ తెలిసిందే. సమంత నాగచైతన్య జాతకం ప్రకారం వీరిద్దరు పెళ్లి చేసుకుంటే విడిపోతారని గతంలో వెల్లడించారు. ఈయన చెప్పిన విధంగా సమంత నాగచైతన్య ఇద్దరు విడిపోయారు. అప్పటినుంచి ఈయన చెప్పే వ్యాఖ్యలను నమ్మే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల గురించి వారి జాతకాల గురించి చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా మరోసారి వేణు స్వామి సమంత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న సమంత ప్రస్తుతం యశోద ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఇకపోతే ఈమె నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.ఇక ఈ సినిమా గురించి వేణు స్వామి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేణు స్వామి మాట్లాడుతూ సమంత నటించిన ఈ సినిమా ద్వారా తనకు భవిష్యత్తులో మరిన్ని పేరు ప్రఖ్యాతలు వస్తాయని తెలిపారు. 2024 వరకు సమంత కెరీర్ ఎంతో అద్భుతంగా ఉంటుందని అప్పటివరకు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు పొందుతారని వేణు స్వామి తెలిపారు.