కమెడియన్ గా దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన మున్నా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న టిల్లు వేణు, అలియాస్ కమెడియన్ వేణు ఇప్పుడు బలగం సినిమాతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక దర్శకుడిగా అతనికి మొదటి అవకాశం ఇచ్చింది కూడా దిల్ రాజు కావడం విశేషం. దిల్ రాజు చిన్న చిత్రాల కోసం దిల్ రాజు ప్రొడక్షన్ అనే బ్యానర్ స్టార్ట్ చేసి లో బడ్జెట్ కథలతో కొత్త దర్శకులని పరిచయం చేయడానికి సిద్ధం అయ్యాడు.
ఇందులో భాగంగా మొదటి అవకాశం వేణుకి ఇవడం విశేషం. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన బలగం మూవీ తాజాగా రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో మూలాలలోకి వెళ్లి భావోద్వేగాలని స్పృశించిన సినిమాగా ఇది ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. ఇక ఈ సినిమాతో నిర్మాత దిల్ రాజు కూడా భారీగా లాభాలు గడించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.
ఓ రెండు వారల పాటు పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో బలగం టాక్ తో కలెక్షన్స్ పరంగా భారీగానే సంపాదించే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు వేణుకి దిల్ రాజు మరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. బలగం షూటింగ్ టైమ్ లోనే వేణు దిల్ రాజుకి ఒక స్టొరీ లైన్ వినిపించాడని సమాచారం.
ఇక ఈ మూవీ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి మరల బలగం రిలీజ్ కి ముందు నేరేషన్ ఇచ్చాడని తెలుస్తుంది. దీంతో దిల్ రాజు ఈ సెకండ్ ప్రాజెక్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, సమాచారం. ఈ విషయాన్ని దిల్ రాజు కూడా అఫీషియల్ గా దృవీకరించారు.
అయితే బలగం కంటే కాస్తా ఎక్కువ బడ్జెట్ తో ఆ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. ఏది ఏమైనా ఒక పెద్ద ప్రొడ్యూసర్ తో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసే అవకాశం కమెడియన్ కమ్ డైరెక్టర్ వేణుకి రావడం నిజంగా విశేషం అని చెప్పాలి. మరి రెండో సినిమాతో దిల్ రాజుకి వేణు ఎలాంటి హిట్ ఇస్తాడు అనేది చూడాలి.