నరేష్ విడాకులు తీసుకుంటారని ముందే చెప్పా : వేణు స్వామి

నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారనే వార్తలు పెద్ద ఎత్తున చెక్కర్లు కొట్టాయి. అయితే వీరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ కలిసి గుళ్ళు గోపురాలు తిరగడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇకపోతే ఈ విషయంపై పవిత్ర లోకేష్ స్పందిస్తూ మా రిలేషన్ కృష్ణ గారికి కూడా తెలుసని చెప్పడంతో రమ్యా రఘుపతి సీన్లోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున వివాదం సృష్టించారు. ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో అందరికీ తెలిసిందే.

ఇకపోతే తాజాగా నరేష్ వ్యవహారంపై ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కృష్ణకి పెద్ద అభిమానినని అయితే ఒక రోజు కృష్ణ విజయనిర్మల జాతకం చెప్పడానికి ఒక రోజు వారి ఇంటికి వెళ్లాను. కృష్ణ విజయనిర్మల జాతకం చూసి 2020 సంవత్సరంలోపు ఇద్దరిలో ఒకరు చనిపోతారని చెప్పాను.తాను చెప్పిన విధంగానే విజయనిర్మల మరణించారని వేణు స్వామి తెలిపారు. విజయనిర్మల కృష్ణ జాతకం చెబుతున్న సమయంలో నరేష్ కూడా అక్కడే ఉన్నారు.

అప్పటికే ఆయనకు రమ్య రఘుపతితో వివాహం చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే నరేష్ రమ్య జాతకం చూసిన తను వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే విడిపోతారని అప్పుడే చెప్పాను. అయినప్పటికీ నరేష్ నా మాట వినలేదు.వీరిద్దరి పెళ్లి జరిగితే విడిపోతారని నాకు తెలుసు కనుక నా చేతుల మీదుగా వీరి పెళ్లి జరిపించలేదని ,ప్రస్తుతం నరేష్ ఆ ఫలితం అనుభవిస్తున్నారు అంటూ వేణు స్వామి ఈ సందర్భంగా నరేష్ రమ్య పెళ్లి విడాకుల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.