Venkatesh : బాలయ్యలా వెంకీ చేయగలడా… కొత్త కాంబినేషన్స్ వర్కౌట్ అయ్యేనా…!

Venkatesh: ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం ఎఫ్3 విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్, వెంకటేష్ ఒక సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వెంకటేష్ ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. మరి ఈ సమయంలో జాతి రత్నాలు ఫేమస్ అనుదీప్ తో సినిమా చేయడానికి వెంకటేష్ అంగీకరించాడని, ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కొత్త కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇదిలా ఉండగా విక్టరీ వెంకటేశ్ కూడా ఓటీటీ ప్లాట్‌ఫాంలో హోస్టుగా అలరించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ తో అన్ స్టాప్అబుల్ చేసిన ఆహార సంస్థ ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కోసం కూడా ఒక సరికొత్త ప్రోగ్రాం ని ప్లాన్ చేసే పనిలో ఉందట. ఆహా.. లో రాబోయే ఈ ప్రోగ్రాం కి వెంకటేష్ హోస్ట్ గా వ్యవహరిస్తారు అట.

నందమూరి బాలకృష్ణ అన్ స్టాప్అబుల్ ప్రోగ్రాం తో ఎంతటి ఘనవిజయం అందుకున్నారు అందరికీ తెలిసిందే. మరి ఓటీటీ ప్లాట్‌ఫాంలో వెంకటేష్ ఎలా అలరిస్తాడో మరి. బాలకృష్ణ చేసిన ఆ షో దేశం లోని నెంబర్ వన్ గా నిలిచింది. మొత్తానికి వెంకటేష్ బాలకృష్ణ బాటలోనే నడుస్తున్నాడు. అయితే బాలకృష్ణ అలసందలు ఉంటాడో లేదో చూడాలి. అంతేకాదు ఈ ప్రోగ్రాం కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా త్వరలోనే ప్రకటిస్తారట. వెరైటీ కాంబినేషన్ అయినా విక్టరీ వెంకటేష్ జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ సినిమా కూడా ఎలా అలరిస్తుందో చూడాలి.