మరో వెబ్ సిరీస్‌పై ఫోకస్ పెట్టిన వెంకీ.!

విక్టరీ వెంకటేష్ ఇటీవలే ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. బాబాయ్ వెంకటేష్, అబ్బాయ్ రానా దగ్గుబాటి కలిసి నటించారు ఈ వెబ్ సిరీస్‌లో.అయితే, ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ నిండా అవసరం లేకపోయినా బూతులు నింపేశారు. దాంతో, అదో వల్గర్ వెబ్ సిరీస్ అయి కూర్చుంది.

ఆ సంగతి పక్కన పెడితే, తాజాగా మరో వెబ్ సిరీస్‌కి విక్టరీ వెంకటేష్ సైన్ చేశారని తెలుస్తోంది. అయితే, ‘రానా నాయుడు’లా వల్గర్ వెబ్  సిరీస్ కాకుండా, ఈసారి డీసెంట్ వెబ్ సిరీస్ చేస్తున్నాడట వెంకీ. డీసెంట్ అంటే, హాట్ అండ్ మసాలా స్టఫ్ వున్నాగానీ, యాక్షన్ ప్యాక్డ్ జోనర్‌లో థ్రిల్లింగ్‌గా వుంటుందని సమాచారమ్. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.