సిఎం రేవంత్‌లో దగ్గుబాటు సోదరుల భేటీ!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని దగ్గుబాటి సోదరులు సురేష్‌ బాబు, వెంకటేష్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్‌ రెడ్డి ఇంటికి చేరుకున్న వెంకటేష్‌, సురేష్‌ బాబులు రేవంత్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.