లిఫ్ట్‌లో ఇరుక్కున్న అనసూయ.. ఆ ఘటనతో అందరికీ కంటతడి!

venkatesh Releases Anasuya Thank you Brother Teaser

అనసూయ భరద్వాజ్ ఏదైనా ఓ పాత్రను ఒప్పుకుందంటే అందులో ఏదో ఒక విశేషం కొత్తదనం ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అలా అనసూయ చేసే ప్రయత్నాన్ని జనాలు కూడా ఆదరిస్తుంటారు. కానీ ఆ మధ్య హీరోయిన్‌గా చేసిన కథనం సినిమా బెడిసి కొట్టింది. దీంతో అనసూయ ఆచితూచి కథలను ఎంచుకుంటోంది. ఆ క్రమంలోనే మరోసారి సాహసం చేసేందుకు రెడీ అయింది.

venkatesh Releases Anasuya Thank you Brother Teaser
venkatesh Releases Anasuya Thank you Brother Teaser

అనసూయ గర్భవతిగా నటిస్తోన్న థ్యాంక్యూ బ్రదర్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే పోస్టర్లు, మోషన్ పోస్టర్లతో అసలు కథ ఏంటన్నది చెప్పేశారు. లాక్డౌన్ సమయం, నిండు గర్భిణి, లిఫ్ట్‌లో ఇరుక్కుంటుంది.. అక్కడే ప్రసవించాల్సిన పరిస్థితి.. అని క్లియర్‌గా తెలుస్తోంది. అయితే తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌లో మరి కొంత కథను బయటకు చెప్పేశారు. వెంకటేష్ తాజాగా ఈ టీజర్‌ను రిలీజ్ చేశాడు.

గురువారం ఈ చిత్ర ట్రైలర్‌ను వెంకటేశ్‌ విడుదల చేశాడు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో డైరెక్టర్‌ రమేశ్‌ సినిమాను తీర్చిదిద్దిన విధానం చూస్తుంటే ఆసక్తిగా ఉందన్నారు. అయితే ఈ టీజర్‌లో అనసూయ పెట్టే ఆర్తనాదాలు.. చివరకు లిఫ్ట్‌లొనే ప్రసవం వంటి సీన్లు ప్రతీ ఒక్కరికీ కంటతడి పెట్టించేలా ఉన్నాయి. చివరకు కథ ఎలా ముగుస్తుందన్ని ఆసక్తిగా మారింది.