వెంకటేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్.. యంగ్ డైరెక్టర్ తో సెట్స్ మీదకి వచ్చేది అప్పుడే..!

వెంకటేష్ ఎఫ్ 2, వెంకీమామా సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా కంప్లీట్ చేశాడు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ రీమేక్ గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. మే 14 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ కూడా లాక్ చేశారు. అధికారకంగా ప్రకటన కూడా ఇచ్చేశారు. ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సురేష్ బాబు – కలైపులి ఎస్ థాను కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే నారప్ప టైటిల్ తో పాటు వెంకటేష్ .. ప్రియమణిల లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఖచ్చితంగా నారప్పతో వెంకటేష్ హ్యాట్రిక్ హిట్ అందుకోబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్ 3 లో నటిస్తున్నాడు. భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ మరొక హీరోగా నటిస్తుండగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.

ఆగస్టు 27 న ఎఫ్ 3 భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే దాదాపు సగభాగం టాకీ పార్ట్ కంప్లీట్ అయిందని సమాచారం. కాగా ఈ సినిమా తర్వాత వెంకటేష్ నటించబోయే సినిమా ఏది అన్నది ఇంక్లా క్లారిటీ రాలేదు. కాని యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లాక్ అయిందని సమాచారం. వాస్తవంగా ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ గురించి వార్తలు వస్తున్నప్పటికి తాజాగా షూటింగ్ డేట్ ని ఫిక్స్ చేశారట. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నుంచి మొదలవబోతోందని సమాచారం. 2022 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ఈ ప్రాజెక్ట్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట.