Venkatesh: ఆ గుడికి వెళ్ళాకే నా జీవితం బాగుపడింది… వెంకటేష్ కామెంట్స్ వైరల్?

Venkatesh: విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వెంకటేష్ బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు.

ఇక ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటేష్ ఎన్నో విషయాలు గురించి వెల్లడించారు తన సినిమాల గురించి అలాగే తన పిల్లలు ఫ్యామిలీ గురించి కూడా ఎన్నో విషయాలను బయటపెట్టారు. అదేవిధంగా తన జీవితంలో ఓసారి బాగా డిస్టర్బెన్స్ వచ్చిందని ఆయన తెలిపారు. అయితే ఆ డిస్టర్బెన్స్ అనేది తాను ఒక గుడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా పోయిందని తెలిపారు.

తాను ఎన్నో చోట్ల తిరిగాను విదేశాలకు కూడా వెళ్లాను కాని అరుణాచలం వెళ్లి స్వామి వారిని దర్శించుకున్న తర్వాత నాకు ఎంతో మనశ్శాంతి దొరికిందని తెలిపారు.స్వామి దర్శనం అనంతరం స్కందాశ్రమంలో మెడిటేషన్‌ చేశాను. అక్కడ ఏదో తెలియని శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అసలైన హ్యూమన్‌ ఎనర్జీ ఎంటో అక్కడే తెలుస్తోంది. నేను అలాంటి శక్తిని అక్కడి నుంచే పొందాను. ఆ తర్వాత నా జీవితంలో ఎలాంటి సంఘటన నన్ను డిస్టర్బ్ చేయలేదని ఈయన తెలిపారు.

ఇప్పుడు నేను మీ ముందు ఇంత యాక్టివ్ గా ఉన్నాను అంటే అందుకు కారణం తాను అరుణాచలం వెళ్లి రావడమేనని వెంకటేష్ తెలిపారు. ఎక్కడ దొరకని ప్రశాంతత అక్కడ ఉంటుంది. అలానే నేను అన్నది మర్చిపోయి , ఏది శాశ్వతము కాదు అని తెలుసుకుంటాము అంటూ ఇలా అరుణాచల మహత్వం గురించి వెంకటేష్ చెప్పడంతో ఈయన కూడా ఇలాంటి వాటిని నమ్ముతారా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.