Venkatesh: సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫస్ట్ ఛాయిస్ వెంకటేష్ కదా…. అసలు విషయం చెప్పిన డైరెక్టర్!

Venkatesh: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14వ తేదీ విడుదల కాబోతుంది.

ఇక ఈ సినిమా విడుదలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి సైతం ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాము సంక్రాంతికి వస్తున్నాం కథను సిద్ధం చేసుకున్నప్పుడే ఈ కథను మెగాస్టార్ చిరంజీవిని దృష్టిలో పెట్టుకొని రాసానని తెలిపారు.

ఈ కథకు ముందుగా అనుకున్న హీరో కూడా చిరంజీవి. కానీ ఆయనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా చేయలేకపోవడంతో వెంకటేష్ ఈ ప్రాజెక్టులోకి వచ్చారు అంటూ అనిల్ రావిపూడి తెలిపారు.త్వరలోనే చిరంజీవితో సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. సాధారణంగా దర్శకులు ఏదైనా ఒక సినిమా కథ రాసేటప్పుడు ఆ కథ ఏ హీరోకి సూట్ అవుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకొని మరి సినిమా కథను సిద్ధం చేస్తుంటారు.

ఇక కథ మొత్తం సిద్ధమైన తర్వాత ఆ హీరోలు అందుబాటులో లేకపోతే కథలో కొన్ని మార్పులు చేస్తూ మరొక హీరోలకు అవకాశాలు కల్పిస్తూ ఉంటారు.. అలా చిరంజీవి దృష్టిలో పెట్టుకొని రాసిన సంక్రాంతికి వస్తున్నాం కత కాస్త వెంకటేష్ వద్దకు వెళ్లిందని స్పష్టమవుతుంది. భగవంత్ కేసరి వంటి సీరియస్ చిత్రం తర్వాత మళ్లీ ఓ కామెడీ సినిమా చేయాలనుకున్నారు. పెళ్లాం, గర్ల్ ప్రెండ్ తో కలిసి ఓ వ్యక్తి ఎడ్వెంచర్ చేయటానికి వెళ్తే ఎలా ఉంటుందనేది. ఈ స్టోరీ లైన్ అనుకోగానే మొదట మెదిలిన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనని కలిసి ఈ లైన్ చెప్పగా తనకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా చేయలేనని తెలిపారు. దీంతో వెంకటేష్ గారిని అప్రోచ్ అయ్యి స్క్రిప్ట్ ఫైనల్ చేశానని తెలిపారు.