రానా నాయుడు వెబ్ సీరీస్ ను భారీ బడ్జెట్‌తో నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇందులో రానా తో పాటు తెలుగు సినిమాల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న ప్రముఖ నటుడు వెంకటేష్ మరో ముఖ్యమైన పాత్రలో నటించారు. అయితే, ఈ సీరీస్ అతని మునుపటి కథల కంటే భిన్నంగా ఉంది. ఇందులో 18 + కంటెంట్ మరియు అసభ్యకరమైన డ్రామా ఉంది.
అసలు కథ వచ్చేసి 15 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన నాగ నాయుడు(వెంకటేష్) చుట్టూ తిరుగుతుంది. ఇక రానా నాయుడుతో సహా తన కుమారులతో తిరిగి కలుసుకోవడానికి అతను ముంబైకి తిరిగి వస్తుంది. రానా నాయుడు విపరీతమైన కోపం ద్వేషం ఉన్న పాత్ర.
ఇక ఈ సీరీస్ లో కుటుంబ భావోద్వేగాలను పొందుపరచడానికి ప్రయత్నించినప్పటికీ ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేలా లేదు. రియాల్టీకి తగ్గట్టుగా కంటెంట్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ డబుల్ మీనింగ్ డైలాగులు వాడని వెంకటేష్ ఈ తరహాలో నటించడం పట్ల చాలా మంది తెలుగు సినీ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
మొత్తంమీద ఆర్ట్ పరంగా చూసినా కూడా కంటెంట్ అంతగా క్లిక్ కాలేదు. బోల్డ్ కంటెంట్ బూతులు ఎక్కువగా ఉండడంతో ఇలాంటి కంటెంట్ అవసరమా? వెంకటేష్ లాంటి నటులు ఇందులో పాల్గొనడం అవసరమా అని తెలుగు సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఇందులో మేయిన్ డ్రామా కూడా అంతగా కొత్తగా ఏమి లేదు. మరి భవిష్యత్తులో వెంకీ ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడో లేదో చూడాలి.