వెంకటేష్ , రోజాకు మధ్య 25 ఏళ్లుగా మాటలు లేవు.. కారణం ఏంటో తెలుసా..?

సినీ పరిశ్రమలో ఒకరికి ఒకరి మధ్య విభేదాలు అనేవి రావడం సహజం. అయితే అవి కొన్నాళ్లకు సద్దుమణిగి సమస్యను పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తారు. అయితే విక్టరీ వెంకటేష్, రోజా సెల్వమణి మధ్య 25 ఏళ్లుగా మాటలు లేవు. అయితే ఎందుకు వారిద్దరి మధ్య ఇంత దూరం.. అసలేమైందో తెలుసుకుందాం.. చిన్నరాయుడు సినిమాను దర్శకుడు సెల్వమణి వెంకటేష్ హీరోగా.. హీరోయిన్ గా రోజాను తీసుకొని తీద్దామనకున్నారట. అయితే ఈ సినిమా కొన్ని కారణాల వల్ల సెట్ పైకి రాలేదట. తర్వాత కొన్నాళ్లకు ఇదే కాన్సెప్ట్ తో వెంకటేష్, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా చిన్నరాయుడు సినిమా తీశారు.దీనిపై రోజాకు విపరీతంగా కోపం వచ్చిందట.

అప్పటి నుంచి ఆమెకు వెంకటేష్ అంటే.. ఎక్కడో కోపంగా ఉండేది. తర్వాత ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకుంటూ.. మళ్లీ వాళ్లిద్దరు కలిసి పోకిరి రాజా సినిమాలో నటించారు. ఇక రోజాకు వెంకటేష్ కు మధ్య ఎక్కవ దూరం రావడానికి కారణం సినిమా షూటింగ్ లో జరిగిన విషయం. ఏమైందంటే.. ఈ సినిమా షూటింగ్ ఓ రోజు ముంబయ్ లో ప్లాన్ చేసుకున్నారు.

రోజాను అక్కడకు రప్పించిన సినిమా చిత్ర సభ్యులు మూడు రోజుల వరకు హోటల్లోని ఉంచారు కానీ.. సినిమా షూటింగ్ మాత్రం జరగలేదు. ఎంతో సహనంతో ఉన్న రోజా ఒక్కసారిగా అసహనానికి గురైంది. షూటింగ్ లేకుండా.. తన టైం మొత్తం వేస్ట్ చేశారు అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది. తర్వాత చిన్న పాటి గొడవలతో వెంటకేష్ తో దూరం పెరిగిపోయిందని సమాచారం. ఆ రోజు నుంచే వెంకీతో సినిమా తీయకూడదని నిర్ణయం తీసుకున్నారట రోజా.