Varun Tej : టాలీవుడ్లో మెగాస్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో మెగా ప్రిన్స్ గా పేరు తెచ్చుకొని తనకంటూ సొంత ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో వరుణ్ తేజ్. విభినమైన సినిమాలతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. F2, గద్దల కొండ గణేష్ సినిమాతో వరుస విజయాలను అందుకున్న వరుణ్ గని సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నాడు. శుక్రవారం గని విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడిన వరుణ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ క్రమంలో తన తండ్రి నాగబాబు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాన్నగా నాపై, నిహారికపై చాలా జాగ్రత్తగా ఉంటాడని వరుణ్ చెప్పాడు. తన తండ్రి నాగబాబు గురించి ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు వరుణ్ తేజ. ఆస్క్ నాగబాబు ద్వారా మీ నాన్నగారు పలు ప్రశ్నలకి జవాబిస్తుంటారు. మరి నాగబాబుకి మీరు అడగాలి అనుకుంటున్నా ప్రశంసలు ఏమైనా ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకి వరుణ్ తేజ్ బదులిస్తూ.. ‘ఇంతకు ముందు అయితే చాలా ప్రశ్నలు ఉండేవి.. కానీ ఇప్పుడేం లేవు. నేను అడగాల్సిన ప్రశ్నలన్నీ ఇప్పటికే అడిగేశా.. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నల్లో కూడా చాలావరకూ నేను అడిగేశా’ అని చెప్పాడు వరుణ్. ఇక నిహారికను నన్ను నాన్న గారు ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతుంటారు.. దయచేసి అలా అడగొద్దని మేం చెప్తూనే ఉంటాం.. కానీ ఆయనకి ఇప్పటికీ అలవాటు షూటింగ్‌లో ఉంటే ఫోన్ చేసి ఎక్కడ అని అడుగుతారు.
నాన్నా షూటింగ్‌లో ఉన్నాం అని అంటే.. త్వరగా వచ్చేయండి అని అంటారు. త్వరగా ఎలా వస్తాం.. షూటింగ్‌లో ఉంటే.. కానీ ఆయన తండ్రిగా అడుగుతుంటారు అని నాగబాబు తండ్రి ప్రేమ గురించి చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్ ప్రస్తావన తెస్తే ఈ విషయం లో పూర్తి స్వేచ్ఛ నాకు మా నాన్న ఇచ్చారని తనకు నాపై నమ్మకం ఎక్కువ అని, తన సినిమా కథల ఎంపిక విషయంలో కూడా తనదే నిర్ణయమని ఎపుడైనా సెకండ్ ఒపీనియన్ కోసం నాన్నను సంప్రదిస్తానని చెప్పారు.