Varun Tej : త్వరలో గని సినిమా ట్రైలర్…కష్టానికి ఫలితం దక్కెనా..!

Varun Tej : మెగా కాంపౌండ్ నుండి వచ్చిన విభిన్న సినిమాలతో తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ తేజ్. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ప్రతి సినిమా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. కంచెతో మొదలైన ప్రయాణంలో ఫిదా, f2, వాల్మీకి, తొలిప్రేమ వంటి విభిన్న సినిమాలు ఉన్నాయి.

ఇక ఇపుడు గని సినిమాతో బాక్సర్ లా అలరించనున్నాడు. బాబాయ్ పవన్ కళ్యాణ్ బాలు సినిమాలోని పాత్ర పేరు అయిన గని పేరు ని సినిమా పేరుగా పెట్టుకున్నాడు.అంతకు ముందు తొలిప్రేమ ను కూడా పెట్టుకుని విజయం. సాధించాడు. ఇక గని సినిమాలో బాక్సర్ లా కనిపించనున్నాడు. ఇందుకోసం బాక్సింగ్ కోచింగ్ కూడా తీసుకున్నాడు.

బాక్సింగ్ కోట్ లో కండలు తిరిగిన దేహంతో అటు తిరిగి కనిపించిన వరుణ్ తేజ్ మొత్తానికి తన సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా పై అంచనాలను పెంచాడు. అయితే, ఈ సినిమాలో బాక్సర్‌ పాత్రలో నటించడానికి వరుణ్‌ తేజ్‌ కఠినమైన కసరత్తులు చేయాల్సి వచ్చింది. వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. పైగా కెరీర్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ లో షర్ట్ లేకుండా నటిస్తున్నాడు.కాగా ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు, వీడియోలకు, పాటలకి ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మాతగా మారబోతున్నాడు. సిద్దు అనే మరో నిర్మాతతో కలిసి బాబీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్‌, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాల పై వస్తోన్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. కరోనా కారణంగా వెనుకబడింది.