కరోనా మహమ్మారి సామాన్య ప్రజల నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు ఎవరినీ వదిలి పెట్టడం లేదు. కరోనా మహమ్మారి సోకకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ మహమ్మారి ఏదొక విధంగా అటాక్ చేస్తూనే ఉంది. త్వరలోనే వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వస్తుందనే వార్తలు వస్తున్నప్పటికీ వైరస్ రూపు మార్చుకొని కొత్తగా వస్తుందనే వార్తలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.
ఇప్పటికే బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన స్ట్రెయిన్ తో మళ్లీ ప్రపంచం మెల్లి మెల్లి గా లాక్ డౌన్ వైపు అడుగులు వేస్తుంది. యూకే కి మిగిలిన ప్రపంచానికి దాదాపుగా ప్రస్తుతం సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో మన దేశంలో కూడా ప్రతి రోజు కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోగా మరికొంత మంది మృతి చెందారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ స్వయంగా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందనీ, తనకు కొద్దిగా మాత్రమే కొరోనా లక్షణాలూ ఉన్నాయని చెప్పాడు. ప్రస్తుతం తాను క్వారంటైన్‌లో ఉన్నాననీ, త్వరలోనే రికవరీ అవుతానని ఆశిస్తున్నానని తెలిపాడు. తనతో కొన్ని రోజులుగా దగ్గరగా ఉన్న వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించాడు.
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 29, 2020