Varun Tej : యూట్యూబ్ రికార్డులు సెట్ చేస్తున్న మెగా ప్రిన్స్…అంచనాలు పెంచుతున్న గని…!

Varun Tej: మెగా కాంపౌండ్ నుండి వచ్చిన విభిన్న సినిమాలతో తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ తేజ్. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ప్రతి సినిమా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. కంచెతో మొదలైన ప్రయాణంలో ఫిదా, f2, వాల్మీకి, తొలిప్రేమ వంటి విభిన్న సినిమాలు ఉన్నాయి.

బాక్సింగ్ కోట్ లో కండలు తిరిగిన దేహంతో అటు తిరిగి కనిపించిన వరుణ్ తేజ్ మొత్తానికి తన సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా పై అంచనాలను పెంచాడు. అయితే, ఈ సినిమాలో బాక్సర్‌ పాత్రలో నటించడానికి వరుణ్‌ తేజ్‌ కఠినమైన కసరత్తులు చేయాల్సి వచ్చింది. వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. పైగా కెరీర్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ లో షర్ట్ లేకుండా నటిస్తున్నాడు.ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బబ్లీ బ్యూటీ సైయి మంజ్రేకర్ హీరోయిన్ ‏గా నటిస్తోంది.

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ అందచేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే తాజాగా ‘గని’ ట్రైలర్ వరుణ్ తేజ్ కెరీర్ లోనే బెస్ట్ రికార్డుని నమోదు చేసింది. ఇక ఈ ట్రైలర్ 10 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ ని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ కంపెనీ ఇంకా అలాగే రెనసాన్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై ‘గని’ సినిమాని రూపొందిస్తున్నారు. అల్లు వెంకటేష్ (బాబీ) ఇంకా అలాగే సిద్దు ముద్ద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయిన ‘గని’ సినిమాకి ‘యూ/ఏ’ (U/A) సర్టిఫికేట్ వచ్చింది. ఇక ఈ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఏప్రిల్ 8 వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది.